
భారీ భూకంపం.. 60 చేరిన మృతుల సంఖ్య (వీడియో)
వరుస భూకంపాలు ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేశాయి. ఇప్పటివరకు 60 మంది చనిపోయారని, వందలాది మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మంగళవారం రాత్రి సెబూ ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 17 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ప్రకంపనలతో కొండచరియలు విరిగిపడి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.




