హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ను, ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన సిట్ బృందం ప్రశ్నించనుంది. ఈ బృందంలో మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ అధికారులు విజయకుమార్, నారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రావు ఉన్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.