కనుమ పండుగ విశిష్టత ఇదే

9994చూసినవారు
కనుమ పండుగ విశిష్టత ఇదే
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అంటే సంక్రాంతి. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో భాగంగా చివరి రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. కనుమ పండుగను ప్రత్యేకించి పాడి పశువులకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. రైతు పండించే పంటలలో పశువులు చేదోడువాదోడుగా ఉండి, రైతులకు తన వంతు సహాయం చేస్తాయి. అందుకు కృతజ్ఞతగా కనుమ రోజు ఉదయం వాటికి స్నానం చేయించి ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు.

సంబంధిత పోస్ట్