ప్రపంచంలోనే అత్యధిక ఎండలు కాసే నగరం ఇదే!

103చూసినవారు
ప్రపంచంలోనే అత్యధిక ఎండలు కాసే నగరం ఇదే!
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న యుమా నగరం ప్రపంచంలోనే అత్యంత ఎండలు కాసే ప్రాంతంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఏడాదికి సుమారు 4000 గంటల పాటు ఇక్కడ ఎండ కాస్తూనే ఉంటుంది. సోనోరాన్ ఎడారి మధ్యలో ఉండటం, చుట్టూ కొండలు, సముద్రం దూరంగా ఉండటం దీనికి కారణాలు. తీవ్ర ఎండల కారణంగా అక్కడి ప్రజల జీవనశైలి కూడా భిన్నంగా ఉంటుంది. చర్మాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేక క్రీములు వాడటం, ఈత కొలనులు వినియోగించడం సాధారణం. ఇదిలా ఉండగా, యుమా వ్యవసాయ రంగంలోనూ ముందంజలో ఉంది. అమెరికాలో వినియోగించే పాలకూరలో 90% ఇక్కడే పండుతుంది.
Job Suitcase

Jobs near you