పెళ్లి కాకుండానే కొందరు స్వేచ్ఛగా గడుపుతుంటారు. OYO హోటళ్లకు సైతం వెళ్తుంటారు. అయితే పెళ్లి కాని జంటలకు గదులు ఇవ్వబోమని OYO ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం OYO దీనిని మీరట్‌లో మాత్రమే అమలు చేస్తోంది. అయితే OYOలో పెళ్లికాని జంటలు దొరికితే జరిమానాలు లేదా శిక్షలు విధించే నిబంధన లేదు. ఎటువంటి చట్టపరమైన చర్యలు ఉండవు. దొరికిన వాళ్లను అక్కడి నుంచి పంపించి వేస్తారు. దేశంలోని ఇతర నగరాల్లో ఇటువంటి నియమం లేదు.