RCB వరుసగా రెండోసారి IPL కప్పును గెలుచుకుంది. కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ, "కెప్టెన్‌గా ఇక్కడ నా ప్రయాణం అద్భుతం. వరుసగా రెండోసారి కప్పును సగర్వంగా ఎత్తుకోవడం మరిచిపోలేని సందర్భం. గతేడాది మాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. కానీ, ఈసారి అంచనాలు ఉన్నాసరే ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడాం. ఎక్కడికి వెళ్లినా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ప్రోత్సహించారు. వారి కోసం ఏం చేసినా తక్కువే. ఈ సలా కప్ నమ్‌దు. ఈసారి కప్పును కూడా వారికే అంకితం చేస్తున్నాం" అని పాటీదార్ వ్యాఖ్యానించాడు.