‘ఆ రోజులు పోయాయి’.. శత్రువులపై ముందే దాడి చేస్తాం: రాజ్‌నాథ్

27చూసినవారు
‘ఆ రోజులు పోయాయి’.. శత్రువులపై ముందే దాడి చేస్తాం: రాజ్‌నాథ్
ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ రక్షణ విధానంలో భారీ మార్పులు వచ్చాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. శత్రు దేశాలు దాడి చేసే వరకు ఎదురుచూసే రోజులు పోయాయని, అవసరమైతే ముందుగానే తిప్పికొట్టే సామర్థ్యం భారత్‌కు ఉందని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో బ్రహ్మోస్‌ క్షిపణులు సత్తా చాటాయని తెలిపారు. స్వదేశీ రక్షణ సామర్థ్యం పెరిగిందని, సరిహద్దు మౌలిక వసతులపై పెట్టుబడులను 400 శాతం పెంచామని రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్