ఫాస్టాగ్ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. కారు విండ్‌షీల్డ్‌పై అతికించకుండా, టోల్ గేట్ల వద్ద వ్యక్తిగతంగా చూపించే ఫాస్టాగ్‌లను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చనుంది. వీటి వల్ల స్కానింగ్‌కు ఎక్కువ సమయం పడటంతో ట్రాఫిక్ జాప్యం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. ఫాస్టాగ్‌ను నిబంధనల ప్రకారం వాహనంపై సరిగా అమర్చాలని సూచించారు.