కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపు లేఖ

21చూసినవారు
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపు లేఖ
కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. తీవ్రవాదులు ఆయనను త్వరలోనే హత్య చేస్తారంటూ పోస్ట్ ద్వారా అందిన ఆ లేఖలో తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన పాశ్వాన్ కార్యాలయం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై భద్రతా దళాలు విచారణ చేపట్టి, ఆయన భద్రతను సమీక్షిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్