TG: ప్రేమ పేరుతో నమ్మించి తన నగ్న వీడియోలు ఉన్నాయని ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేట్ సంస్థలో 8 నెలలుగా పని చేస్తున్న యువతికి కోడూరి గోపి(24) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రేమపేరుతో ఆమెకు దగ్గరై శారీరక సంబంధం కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఇంట్లో వాళ్లకు బాగోలేదని రూ.1 లక్ష అప్పు తీసుకుని, తిరిగి ఇవ్వమని అడిగితే తన వద్ద నగ్న వీడియోలు ఉన్నాయని.. వాటిని ఆన్లైన్లో పెడతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.