రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

11839చూసినవారు
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
ఈ ఏడాది రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ అవార్డు లభించింది. సుసుము కిటగావా, రిచర్డ్‌ రాబ్సన్, ఓమర్‌ ఎం. యాఘిలకు ఈ అవార్డు దక్కింది. వారు మెటల్‌-ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్‌లను (MOFs) అభివృద్ధి చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని పొందారు. కాగా, ఇవి వాయు నిల్వ, క్యాటలిసిస్‌, పర్యావరణ శుద్ధి వంటి రంగాల్లో విస్తృత ఉపయోగాలు కలిగిన పదార్థాలు.