
ముంబైలో భారీ వర్షాలు.. ముకేశ్ అంబానీ కాన్వాయ్కి తప్పిన ప్రమాదం
భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బీఎంసీ ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలో అక్కడ కురుస్తున్న వర్షాలకు ముకేశ్ అంబానీ భద్రతా కాన్వాయ్ ఎదుట ఓ భారీ వృక్షం కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.




