శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం నారనాగేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.