మిజోరాంలో కారు అదుపుతప్పి లోయలో పడి ముగ్గురు కేంద్ర ప్రభుత్వ మీడియా అధికారులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారిక సమావేశాలకు హాజరై తిరిగి వస్తుండగా సటెక్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అస్వస్థతకు గురికావడమే దీనికి కారణమని తెలుస్తోంది. మృతులు PIB, CBC ఇంఫాల్ ప్రాంతీయ కార్యాలయ అదనపు డైరెక్టర్ జనరల్ ఎంగమ్ పామే, డీడీకే ఐజ్వాల్ డైరెక్టర్ నంపిబౌ మెరిన్మాయ్, సీబీసీ ఐజ్వాల్ ఫీల్డ్ ఆఫీస్ సిబ్బంది హెచ్.లియాన్వెలాగా గుర్తించారు. గాయపడిన వారికి జోరం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.