వివిధ కారణాలతో ముగ్గురు ఆత్మహత్య

65917చూసినవారు
వివిధ కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
AP: వివిధ కారణాలతో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయంతో కుటుంబాలు బోరుమంటున్నాయి.
- కణపాక ప్రాంతానికి చెందిన శశిభూషణరావు (29) పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాడు. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో పురుగుల మందు తాగాడు.
- గాజులరేగ ప్రాంతానికి చెందిన సౌజన్య (29).. డెంకాడకు చెందిన కిశోర్‌ను ప్రేమించింది. పెళ్లికి నిరాకరించడంతో ఉరేసుకుంది.
- కొత్తపేట కుమ్మరి వీధికి చెందిన వి.వెంకట వరహాలు (65) పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్