తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు 3 రోజుల పాటు మూతపడనున్నాయి. రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సందర్భంగా ఈ వరుసల సెలవులు లభించాయి. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులతో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాల సందడి ఇప్పటికే మొదలైంది.