TG: రాష్ట్రంలోని విద్యార్థులకు ఆగస్టులో వరుసగా మూడు రోజులు(ఆగస్టు 8 - 10 వరకు) సెలవులు రానున్నాయి. ఆగస్టు 8 (శనివారం) రెండో శనివారం కావడంతో ప్రభుత్వ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఉండనుంది. ఆగస్టు 9 (ఆదివారం) వారాంతపు సెలవుతో పాటు బోనాల పండుగను నిర్వహించనున్నారు. ఇక ఆగస్టు 10 (సోమవారం) బోనాల అనంతరం నిర్వహించే సాంప్రదాయ 'రంగం' కార్యక్రమం సందర్భంగా కొన్ని జిల్లాల్లో సెలవు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.