తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

80చూసినవారు
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
దిత్వా తుఫాను ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 3, 4, 5 తేదీలలో హైదరాబాద్ నగరం సహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చిరు జల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో వాతావరణం పొడిగా ఉంటుందని, డిసెంబర్ 6, 7 తేదీల్లో కూడా పొడి వాతావరణమే కొనసాగుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :