TG: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో గురువారం ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడపడానికి వెళ్లిన ముగ్గురు యువకులు హల్దీ వాగులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన ప్రశాంత్, వికాస్, ఆనంద్ రెడ్డి (27) అనే స్నేహితులు తూప్రాన్ లో వివాహ వేడుకకు హాజరై, తిరిగి వెళ్లే మార్గంలో నాచారం వద్ద హల్దీ వాగులో సేదతీరడానికి దిగారు. నీటి లోతును అంచనా వేయలేక ప్రవాహంలో చిక్కుకుని మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.