ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. కాలచౌకి ప్రాంతంలో ఒక గణేష్ మండపం సమీపంలో విద్యుత్ షాక్ తగలడంతో 8 ఏళ్ల రాఘణి ఘన్శ్యామ్ యాదవ్ అనే చిన్నారితో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఫైర్ బ్రిగేడ్ ప్రాథమిక సమాచారం. గాయపడిన వారిని భైకల్లాలోని మసీనా ఆసుపత్రికి తరలించారు.