వరంగల్ ఎంజీఎంలో పైకప్పు కూలి ముగ్గురికి గాయాలు (VIDEO)

4033చూసినవారు
TG: వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడి పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ (55)తో పాటు అటెండర్లు ఎల్లమ్మ (50), ఓంకార్ (33) గాయపడ్డారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితులు జనగామ జిల్లాకు చెందినవారు. ఈ ఘటనతో ఆసుపత్రి భవన నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్