కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

38చూసినవారు
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని వరి పొలంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్