TG: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా గ్రామంలో ఆదివారం పోలియో చుక్కలు వేయించుకున్న మూడు నెలల బాబు కొద్దిసేపటికే మృతి చెందాడు. సర్కూర్ దొడ్డి ఉమాకాంత్–స్వర్ణలత దంపతుల కుమారుడికి పోలియో చుక్కలు వేయించిన తర్వాత అస్వస్థతకు గురై, వాంతులు, ఏడుపు ఆగకపోవడం, కళ్ళు తెల్లబారడం, చేతులు కాళ్లు విలవిలలాడడంతో తల్లిదండ్రులు కంగ్టి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది.