TG: దేశం గర్వించదగిన గొప్ప నేత సీనియర్
ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మైత్రివనంలో
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలంటే ముగ్గురు జాతిరత్నాలను స్మరించుకోవాలని రేవంత్ అన్నారు. అంబేడ్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ భారతదేశ జాతిరత్నాలంటూ కొనియాడారు. నీతి, నిజాయతీ, ఉక్కుసంకల్పం కలిగిన వ్యక్తి
ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తనకు జీవితకాలం గుర్తుంటుందన్నారు.