వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీలో ఒకే ఇంటి నుంచి ముగ్గురు వ్యక్తులు సర్పంచులుగా సేవలందించారు. తల్లి, కొడుకు, కోడలు గ్రామ ప్రథమ పౌరులుగా పనిచేశారు. 2001లో బానోతు కోమటి (కోడలు) సర్పంచిగా ఎన్నికై 2006 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆమె అత్త బానోతు మల్లమ్మ 2006 నుంచి 2011 వరకు సర్పంచిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో బానోతు దస్రు (కొడుకు) గెలుపొంది 2024 వరకు సర్పంచిగా కొనసాగారు.