ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి

0చూసినవారు
ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో ఘోర విషాదం నెలకొంది. హోలీ ఆడుతూ చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు నవీన్‌కుమార్‌ (11), సాయి (16), వెంకటజోసఫ్‌ (16)గా గుర్తించారు. నవీన్‌కుమార్‌, వెంకటజోసఫ్‌ మృతదేహాలు లభ్యం కాగా, సాయి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్