జాతీయగేయం వందేమాతరాన్ని అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకునే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971, 1971లో సవరణలు చేయనుంది. ప్రస్తుతం ఈ చట్టం జాతీయ గీతం జనగణమన, భారత రాజ్యాంగం, జాతీయ జెండా గౌరవ పరిరక్షణకు వర్తిస్తోంది. తాజా సవరణ అమల్లోకి వస్తే వందేమాతరాన్ని అవమానించిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటినీ కోర్టు విధించే అవకాశం ఉంటుంది.