AP: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లంకెలకూరపాడు గ్రామానికి చెందిన సాగరబాబు, రాజకుమారి దంపతుల మూడేళ్ల కుమారుడు నితిన్ బస్సు చక్రాల కింద పడి మంగళవారం మృతి చెందాడు. పెద్ద కుమారుడు సిద్ధార్థను పాఠశాల బస్సు ఎక్కించేందుకు తల్లి రాజకుమారి వెళ్లగా.. ఆమె వెంట నితిన్ కూడా వచ్చాడు. రోడ్డు దాటుతున్న చిన్నారిని డ్రైవర్ గమనించకుండా బస్సు ముందుకు పోనివ్వడంతో నితిన్ కిందపడిపోయాడు. బస్సు వెనుక చక్రం చిన్నారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.