కేరళలో ఘనంగా ప్రారంభమైన త్రిస్సూర్ పూరం ఉత్సవాలు (వీడియో)

27చూసినవారు
కేరళలోని త్రిస్సూర్‌లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఏప్రిల్–మే నెలల్లో వడక్కున్నథన్ ఆలయంలో జరిగే ఈ వేడుకలు రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా గుర్తింపు పొందాయి. సుమారు 36 గంటల పాటు అద్భుతంగా సాగే ఈ ఉత్సవాల్లో బంగారు ఆభరణాలతో అలంకరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏనుగులపై నుంచి రంగురంగుల గొడుగులను వేగంగా మార్చే సంప్రదాయం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్