డబ్బుల కోసం యువతిని పట్టుకుని కత్తితో బెదిరించిన దుండగుడు(వీడియో)

23చూసినవారు
ఓ బట్టల దుకాణంలో డబ్బుల కోసం ఓ వ్యక్తి మహిళను పట్టుకుని మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. యూపీలోని బిజ్నోర్‌లో డిసెంబర్‌ 31న ఈ ఘటన జరిగింది. బట్టల షాపులోకి ప్రవేశించిన ఒక వ్యక్తి షాపింగ్‌ చేస్తున్న యువతిని పట్టుకున్నాడు. మెడపై కత్తి పెట్టి ఆమెను చంపుతానని బెదిరించాడు. తనకు లక్ష ఇవ్వాలని షాపు యజమానిని డిమాండ్‌ చేశాడు. సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు చాకచక్యంగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ యువతిని సురక్షితంగా కాపాడారు. అనంతరం దుండగుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్