ఇంట్లో మహిళను నరికి బయటి నుంచి తాళం వేసి వెళ్లిన దుండగులు

18757చూసినవారు
TG: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఇప్పలతండాలో చిట్టి (30) అనే మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఆమెను నరికి, దుండగులు బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. మహిళ హత్య రెండ్రోజుల క్రితమే జరిగినట్లు సమాచారం. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో సోమవారం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్