TG: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. పవర్ సప్లై కట్ చేసి, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు, గ్యాస్ కట్టర్లతో SBI ఏటీఎంను రెండు భాగాలుగా చేసి, డబ్బులున్న యంత్రంతో పరారయ్యారు. బోయపల్లి పొలాల వద్ద ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నవాబ్‌పేట నుంచి షాద్‌నగర్ మీదుగా వెళ్లినట్లు గుర్తించారు. ఏటీఎంలలో సుమారు రూ.2.30 లక్షల నగదు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.