థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు మందులతో పాటు ఆహారంలో సరైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అహ్మదాబాద్‌కు చెందిన ఫిజీషియన్ డాక్టర్ మనోజ్ విత్లానీ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడానికి అయోడిన్, సెలీనియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అవసరమని సూచిస్తున్నారు. అయోడైజ్డ్ ఉప్పు, పాలు, గుడ్లు, చేపలు, గింజలు, పప్పు ధాన్యాలు, బెర్రీలు, టమోటాలు వంటివి తినాలని, ఆరోగ్యకరమైన కొవ్వులు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు తీసుకోవాలని ఆయన తెలిపారు.