థైరాయిడ్ గ్రంథిలో అసమతుల్యత వల్ల హార్మోన్ల ఎక్కవ, తక్కువగా ఉత్పత్తి అవుతాయి. హైపోథైరాయిడిజంతో అలసట, బరువు పెరగడం, చలిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్యలు మహిళల్లో పీరియడ్స్ సమస్యలు, మూడ్ స్వింగ్స్, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. హైపర్ థైరాయిడిజం వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.