
రేపటి నుంచి పర్యావరణ గ్రామసభలు: పంచాయతీరాజ్ శాఖ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. జూన్ 1 నుంచి 15వ తేదీ మధ్యలో ఏదో ఒకరోజు ఈ సభలు నిర్వహించాలి. సభల నిర్వహణ, షెడ్యూల్, ఫొటోల అప్లోడ్ వంటి అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) విడుదల చేయబడింది. ఈ కార్యక్రమాలన్నింటినీ ‘పంచాయతీ నిర్ణయ్’ మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు.




