దేశంలో నాలుగేళ్లకు ఒకసారి పులుల గణన!

17469చూసినవారు
దేశంలో నాలుగేళ్లకు ఒకసారి పులుల గణన!
భారతదేశంలో పులుల గణనను మొదటిసారి 2006లో చేపట్టారు. అప్పుడు 1411 పులులు ఉన్నాయి. అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి వీటిని లెక్కిస్తున్నారు. 2010లో పులుల సంఖ్య 1706 ఉండగా, 2014లో 2226, 2018లో 2967, 2022లో 3167 ఉన్నాయి. అయితే 2025 జులై నాటికి దేశంలో 58 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్, కవ్వాల్, అమ్రాబాద్‌ రిజర్వ్‌లు ఉన్నాయి. దేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్- 785, కర్ణాటక-563, ఉత్తరాఖండ్-560, మహారాష్ట్ర-444.

సంబంధిత పోస్ట్