మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లా ఉమ్రేడ్ తాలూకా పరిధిలోని ఒక వ్యవసాయ బావిలో పులి పడిపోయింది. పశువుల కాపరి యోగేష్ బావిలోకి నీళ్ల బాటిల్ వేసినప్పుడు పులి గర్జించడంతో ఈ విషయం వెలుగుచూసింది. అతను వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించగా, ప్రత్యేక రెస్క్యూ టీమ్ రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుంది. తాడులు, వలలు, బంధించే మందుల సహాయంతో రాత్రంతా శ్రమించి పులిని సురక్షితంగా బయటకు తీసి, అడవిలోకి వదిలిపెట్టారు.