
ఆసియా కప్లో యువ భారత్ ఘన విజయం
దుబాయ్లో జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 మ్యాచ్లో భారత యువ జట్టు మలేషియాపై 315 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో మలేషియా 93 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 5 వికెట్లు తీయగా, బ్యాటింగ్లో అభిజ్ఞాన్ కుందు 209 పరుగులతో అజేయంగా నిలిచాడు. వేదాంత్ త్రివేది 90, వైభవ్ సూర్యవంశీ 50 పరుగులు చేశారు.




