
శివరాత్రి ఉపవాసం.. వీరు ఉండకూడదు!
శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం భక్తితో కూడుకున్నదే అయినా, మధుమేహం, గుండె జబ్బులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, కిడ్నీ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కఠినమైన ఉపవాస దీక్షలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకోకపోవడం వల్ల వీరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. శస్త్రచికిత్స చేయించుకున్నవారు, దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారు, పాలిచ్చే తల్లులు కూడా ఉపవాసానికి దూరంగా ఉండాలి. తప్పనిసరిగా ఉపవాసం ఉండాలనుకుంటే, పండ్లు, పాలు వంటి ఫలాహారం తీసుకోవచ్చు.




