భారత్‌లో నిషేధించబడిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ 'టిక్‌టాక్' తాజాగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. గురుగ్రామ్‌లోని తన ఆఫీస్‌లో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. వీటిలో ఒకటి కంటెంట్ మోడరేటర్ (బెంగాలీ మాట్లాడగల అభ్యర్థి), మరొకటి మంచి భాగస్వామ్యం, కార్యకలాపాల నాయకత్వానికి సంబంధించిన పోస్టులు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ సేవలు భారత్‌లో మళ్లీ అందుబాటులోకి రాబోతున్నాయా? అనే ప్రచారం జోరందుకొంది.