ఫ్రెంచ్ సైక్లిస్ట్, టిక్‌టాక్ స్టార్ అరోలియాన్ ఫాంట్‌నోయ్ ఈఫిల్ టవర్ మెట్ల మార్గం గుండా సైకిల్‌పై 12 నిమిషాల 30 సెకన్లలో ఎక్కి అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. 686 మెట్లున్న ఈఫిల్ టవర్‌ను ఎక్కడా కాలు కింద పెట్టకుండా అధిరోహించి, 2002లో హ్యూగ్స్ రిచర్డ్ నెలకొల్పిన 19 నిమిషాల రికార్డును బద్దలు కొట్టారు. కోవిడ్, ఈఫిల్ టవర్ పనులు, ఒలింపిక్స్ వంటి కారణాల వల్ల ఈ ప్రయత్నం ఆలస్యమైందని ఫాంట్‌నోయ్ తెలిపారు. తదుపరి లక్ష్యంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను ఎక్కాలని ఆయన పేర్కొన్నారు.