క్రికెటర్ తిలక్ వర్మ, 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్‌ను చిరంజీవి పూల మాలలతో సన్మానించి, ఆయన ప్రతిభను కొనియాడారు. అనంతరం చిత్ర బృందం తిలక్‌తో కేక్ కట్ చేయించింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.