కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ 110వ జయంతి సందర్భంగా నిర్వహించిన భజన్ క్లబ్బింగ్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొనడాన్ని ఆయన ప్రశ్నించారు. భజనలకు సమయం కేటాయించే ప్రధాని, ఎన్నికల సంఘంపై తలెత్తుతున్న వివాదాలపై స్పందించడానికి టైం లేదని ఖర్గే ఆరోపించారు. గత 13 ఏళ్లుగా ప్రధాని ఇలాంటి ఎన్నో ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నారని ఆయన అన్నారు.