
గేట్ టెస్టు పేపర్ల షెడ్యూల్ విడుదల
గేట్ 2026 పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఐఐటీ గువాహటి కీలక అప్డేట్ విడుదల చేసింది. పరీక్షల పూర్తి షెడ్యూల్ను వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ పరీక్ష జరగనుంది. దరఖాస్తుల సవరణ గడువు ముగిసినప్పటికీ, అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, నవంబర్ 18న కరెక్షన్ విండోను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.




