నిమ్మ మొక్కల కొమ్మల కత్తిరింపు, సంరక్షణపై సూచనలు

19చూసినవారు
నిమ్మ మొక్కల కొమ్మల కత్తిరింపు, సంరక్షణపై సూచనలు
నిమ్మ మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అంటు కొమ్మలను నాటిన తర్వాత, వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలని వ్యవసాయ నిపుణులు సూచించారు. కాండంపై 2 అడుగుల ఎత్తు వరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసివేయాలి. చెట్టుకు అనవసరమైన, ఎండుబారిన, తెగులు సోకిన కొమ్మ భాగాలను కూడా కత్తిరించాలి. కొమ్మ కత్తిరింపుల అనంతరం, చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్‌ను పిచికారీ చేయాలి. అలాగే, చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలని సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్