
తెలుగు రాష్ట్రాల్లో ఐదురోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఐదురోజులపాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 8-11 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో బలమైన గాలులు వీస్తాయి. ఆగస్టు 8న కోస్తాంధ్ర, యానాం, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్లకల్లోల పరిస్థితుల కారణంగా మత్స్యకారులు ఆగస్టు 8, 9 తేదీల్లో చేపల వేటకు వెళ్లరాదని IMD హెచ్చరించింది.




