
అమితాబ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రభాస్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన 83వ పుట్టినరోజు నేడు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అమితాబ్‌తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వీరిద్దరూ కలిసి 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పనులు జరుగుతున్నాయి. అయితే 'కల్కి 2' సీక్వెల్లో దీపికా పదుకొణె స్థానంలో అలియా భట్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.




