
ఫాస్టాగ్: ఫిబ్రవరి 1 నుంచి కేవైవీ తొలగింపు
ఫాస్టాగ్ జారీలో జాప్యం లేకుండా NHAI కీలక నిర్ణయం తీసుకుంది. లైట్ వెయిట్ వెహికల్స్ అయిన కార్లు, జీపులు, వ్యాన్లకు నో యువర్ వెహికల్(KYV) ప్రాసెస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి1 నుంచి అమల్లోకి రానుంది. సరైన పత్రాలున్నప్పటికీ ఫాస్టాగ్ యాక్టివేషన్లో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వాహనదారులకు దీని ద్వారా ఊరట లభించనుంది.




