టీఎంసీ పార్టీలో అవినీతి ఉందని, ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారని ఆ పార్టీపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశారు. MLAగా ఉన్న తననూ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారని, అందుకే ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించానన్నారు. మమతా బెనర్జీ ఆహ్వానిస్తేనే పాలిటిక్స్‌లోకి వచ్చినట్లు తివారీ గుర్తుచేసుకున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. సొంత నిధులు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయాల్సి వచ్చిందని తెలిపారు.