నేడు (బుధవారం) నందమూరి హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, నటుడు జూనియర్
ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. తన తండ్రిని స్మరించుకుంటూ.. ‘‘ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’’ అంటూ నివాళులర్పించారు. కాగా, హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2న జన్మించగా.. 2018 ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.